Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇటు కేరళ బ్యూటీ .. అటు హర్యానా భామ!

Samyuktha and Meenakshi upcoming movies
  • కేరళ నుంచి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్ 
  • చేసిన రెండు సినిమాలూ హిట్ 
  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'సార్' మూవీ 
  • 'హిట్ 2' మూవీతో రానున్న మీనాక్షి 
  • డిసెంబర్ 2వ తేదీన సినిమా విడుదల  
తెలుగు తెరపై ఒక వైపున పూజ హెగ్డే .. రష్మిక .. కీర్తి సురేశ్ జోరు కొనసాగుతూనే ఉంది. ఇక యంగ్ హీరోల జోడీగా ఒక వైపున కృతి శెట్టి .. మరో వైపున శ్రీలీల వరుస సినిమాలను చక్కబెడుతున్నారు. ఈ మధ్యలో ఉన్న హీరోలకి హీరోయిన్స్ కావాలంటే, ఇప్పుడు ఇద్దరు కథానాయికల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి . ఒకరు సంయుక్త మీనన్ అయితే మరొకరు మీనాక్షి చౌదరి. 

సంయుక్త మీనన్ కేరళ బ్యూటీ. 2016 లోనే మలయాళ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి, ఆ తరువాత తమిళ సినిమాలను కూడా పలకరించి టాలీవుడ్ కి వచ్చింది. తెలుగులో ముందుగా 'బింబిసార' సినిమాకి సైన్ చేసినప్పటికీ, ముందుగా థియేటర్లకు వచ్చిన సినిమా 'భీమ్లా నాయక్'. ఈ సినిమాలో ఆమె రానా సరసన మెప్పించింది. ఈ రెండు సినిమాలు హిట్ కొట్టడం ఆమెకి కలిసొచ్చింది. ప్రస్తుతం ధనుశ్ జోడీగా ద్విభాషా చిత్రమైన 'సార్' తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.

ఇక మీనాక్షి చౌదరి విషయానికి వస్తే తాను హర్యానా భామ. సుశాంత్ జోడీగా 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాను ముందుగా చేసినప్పటికీ, 'ఖిలాడి' సినిమాతో ఆమెకి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ, గ్లామర్ పరంగా తనకి రావలసిన మార్కులను వసూలు చేసింది. ఇక తన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'హిట్ 2' ముస్తాబవుతోంది. అడివి శేష్ హీరోగా నాని నిర్మించిన ఈ సినిమా, డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో ఈ భామలిద్దరూ ఇక్కడ నిలదొక్కుకుంటారేమో చూడాలి.
Samyuktha Menon
Meenakshi Choudary
Tollywood

More Telugu News